![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద గుప్పెడంత మనసు సీరియల్ ఒక సెన్సేషన్ ని సృష్టించింది. అందులో రిషి సర్ ని చూస్తే చాలు ఆడియన్స్ కి పూనకాలు లోడింగ్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి . కానీ రిషి ఈ సీరియల్ లో కొంత కాలంగా కనిపించడం మానేసాడు. జగతి మేడం కూడా ఈ సీరియల్ నుంచి పక్కకు తప్పుకుంది. ఐతే రిషి లేని ఈ సీరియల్ ని ఆడియన్స్ చూడడం మానేశారు.
దానికి తోడు సీరియల్ ప్రసారమయ్యే టైమింగ్స్ ని కూడా ప్రతీ సారి మార్చేస్తూ వచ్చేసరికి ఆ సీరియల్ రేటింగ్ కూడా పడిపోయింది. మినిమం వ్యూస్ కూడా రావడం మానేశాయి. రిషి సర్ ఈ సీరియల్ లో ఉన్నంత వరకు వీక్లీ రేటింగ్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ టాప్ లో ఉండేది. కానీ రిషి కనిపించడం మానేసాకా ఈ సీరియల్ గురించి ఎవరూ పట్టించుకోవడం మానేశారు. ఇక సోషల్ మీడియాలో రిషి సర్ ఎక్కడ ? ఎప్పుడొస్తారు ? అంటూ నెటిజన్స్ పదేపదే అడుగుతూ ఉండడంతో చివరకు రిషి సర్ ని సీరియల్ లోకి మళ్ళీ తీసుకురాలేక తప్పలేదు సీరియల్ మేకర్స్. ఇక ఆటో డ్రైవర్ గెటప్ లో రిషి ఎంట్రీ ఇచ్చాడు. ఈ రిషి ఎంట్రీ తో సీరియల్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. రిషి రీ-ఎంట్రీ ప్రోమో, రిషి-వసుధారా చేసిన రీల్స్ అన్నీ కూడా 1 మిలియన్ నుంచి 2 . 5 మిలియన్స్ వ్యూస్‌ని క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.. ఇటీవలి కాలంలో ఒక సీరియల్ ప్రోమోకి ఇంతలా వ్యూస్ రావడం లేదనే చెప్పొచ్చు. రిషి ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తే వ్యూస్ తో సోషల్ మీడియా కూడా షేక్ అవ్వాల్సిందే అనే విషయం అర్ధమవుతోంది.
![]() |
![]() |